


Verified Field Report • Authentic News
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు అత్యంత విలువైనది. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మనం కోరుకుంటాం. అయితే, ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత ఓటు ఎలా వేయాలనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. చివరి క్షణంలో ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండాలంటే ముందే ఈ విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Suvarnamani
క్షేత్ర స్థాయి ప్రతినిధి • DESK
తదుపరి చదవండి
30 కథనాలు

ఎలక్షన్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నివేదిక
మోడవలస వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్‌పోస్ట్ వద్ద డెంకాడ ఎస్.ఐ సన్యాసి నాయుడు పర్యవేక్షణలో తనిఖీ నిర్వహించడమైనది. ఈ తనిఖీలో భాగంగా చెక్‌పోస్ట్ సిబ్బందితో కలసి వాహనాలను అలాగే ప్రయాణికుల బ్యాగ్‌లను వివరంగా తనిఖీ చేయడం జరిగింది.

తుపాను హెచ్చరికలు
తుపాను వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విజయనగరం జిల్లా చేనేత కార్మికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారి సూచించారు. మగ్గాలు తడవకుండా టార్పాలిన్లు కప్పాలని, నూలు, తయారైన వస్త్ర నిల్వలను పొడి ప్రదేశాలకు తరలించాలని తెలిపారు. విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉంటూ, ప్రాణభద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం
జిల్లాలోని విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం రాజీవ్ స్టేడియం, గ్రోత్ సెంటర్, సి.కె.ఎమ్. కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రతి టేబుల్‌కు నలుగురు సిబ్బందిని నియమించారు. విజయనగరంలో 2 రౌండ్లు, బొబ్బిలిలో 4 రౌండ్లు, నెల్లిమర్లలో 6 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాల్లోకి ఫోన్లు, వాటర్ బాటిళ్లకు అనుమతి లేదు. ప్రతి టేబుల్ వద్ద వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ విరామం లేకుండా లెక్కింపు కొనసాగించనున్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఎస్.కోట నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రచారం నిర్వహించారు. సంత గౌరమ్మపేటలో ఎంపీటీసీ అభ్యర్థి రాయవరపు చంద్రశేఖర్, జడ్పీటీసీ అభ్యర్థి డోకుల సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే శివరామరాజుపేటలో బీజేపీ అభ్యర్థి కొట్టాడ రమాదేవికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జీఎస్ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు

600 మంది పోలీసులతో కౌంటింగ్ వద్ద పటిష్ట బందోబస్తు
విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద 600 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నవంబరు 2న రాజీవ్ క్రీడా ప్రాంగణంలో భద్రతను తనిఖీ చేసిన ఆయన, ఇద్దరు అదనపు ఎస్పీలు, 6 డీఎస్పీలు, 14 మంది సీఐలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్ట్రాంగ్ రూముల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, గుర్తింపు కార్డులున్న వారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు. కేంద్రాల లోపలికి ఫోన్లకు అనుమతి లేదని, పరిసరాల్లో విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, వదంతులు ప్రచారం చేయడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని కోరారు.

భోగాపురంలో జడ్పీటీసీ ప్రచారం
భోగాపురం మండలంలోని రైతుల భూములను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడతానని కర్రోతు బంగార్రాజు హామీ ఇచ్చారు. రైతులకు నష్టం కలగకుండా కంపెనీల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూములను పరిశీలిస్తానన్నారు. ఎన్నికల అనంతరం ఈ అంశంపై మరోసారి చర్చిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలను వివరించారు. భోగాపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమార్తె కర్రోతు చంద్రకళను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ముందుగా భోగాపురం గ్రామంలో టీడీపీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పచ్చజెండాలతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని నినాదాలు చేశారు.

మోదవలసలో పోలీసుల అవగాహన
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డెంకాడ ఎస్సై సన్యాసి నాయుడు, భోగాపురం రూరల్ సి.ఐతో కలసి మోదవలస (హైపర్ సెన్సిటివ్) గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల రోజు ఎలాంటి వివాదాలు జరగకుండా గ్రామస్థులకు 144 / 163 BNSS సెక్షన్ల పై అవగాహన కల్పించారు.

అనాథ వృద్ధుడికి అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన నిరుపేద వృద్ధుడు బూరపు లోవరాజు (75) అంత్యక్రియలను TSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట స్వర్గధామంలో నిర్వహించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో ఉన్నవారికి తోడుగా నిలవడమే నిజమైన సేవా భావమని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు యాగాటి నలమహారాజు, పిడుగు సతీష్, లోపింటి కళ్యాణ్ పాల్గొన్నారు.

ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా..
నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 62 డివిజన్లలో నమోదైన 1,39,929 ఓట్ల లెక్కింపు కోసం వార్డుకు ఒకటి చొప్పున 62 బ్లాక్‌లను సిద్ధం చేశారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పొలిటికల్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరచి మేయర్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేసి 25 చొప్పున కట్టలు కడతారు. అనంతరం మేయర్ ఓట్లతో పాటు వార్డు సభ్యుల ఓట్లను రెండు రౌండ్లలో (మొదటి రౌండ్లో 1-31, రెండో రౌండ్లో 32-62 డివిజన్లు) సజావుగా లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిళ్లకు కఠిన నిషేధం. 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది
మున్సిపల్ ఎన్నికల ఆంక్షలు అమలు
మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ లక్ష్మణమూర్తి తెలిపారు. పోలింగ్ రోజు నుండి ఈ నెల 3వ తేదీన కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాజీవ్ స్టేడియం చుట్టూ 200 మీటర్ల పరిధిలో జనసంచారం, చిరు వ్యాపారాలపై నిషేధం విధించామని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని, నిబంధనలు మీరితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
91.72% పెన్షన్ల పంపిణీ పూర్తి: శ్రీనివాస చక్ర పాణి
గత 30వ తేదీ నాటికి జిల్లాలో 91.72 శాతం పెన్షన్ల పంపిణీ విజయవంతంగా పూర్తయిందని గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులోకి రావడం మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ పోలింగ్ లెక్కింపునకు వేళాయె
నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి, కమిషనర్ బాలస్వామి తెలిపారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి (IAS) ఆదేశాల మేరకు 62 టేబుళ్లపై ఒకేసారి పారదర్శకంగా లెక్కింపు జరుగుతుందని, ఎటువంటి పుకార్లు నమ్మవద్దని పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్‌కు అనుమతి ఉంటుందని, సిబ్బందికి రెండుసార్లు శిక్షణ ఇచ్చామని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత, బ్యాలెట్ బాక్సుల్లోని మేయర్, వార్డు మెంబర్ ఓట్లను వేరుచేసి (Segregation) లెక్కింపు పూర్తి చేస్తామని వివరించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత
కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు విజయనగరం డిఎస్పీ లక్ష్మణమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం ఇద్దరు గార్డుల పహారా ఉంటుందని, అలాగే ఆ ప్రాంగణమంతటా సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితో పాటు కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మొబైల్ పోలీస్ బృందాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తును సిద్ధం చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
చిన్నారులపై హెచ్ఎం అఘాయిత్యం
విజయనగరం జిల్లా గరివిడి మండలం గదభవలస ప్రాథమికోన్నత పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహించిన వారు గ్రామస్థులతో కలిసి పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంఈఓ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.
స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ వైఫల్యం
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఏపీ లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. మద్యం, నగదు పంపిణీని అడ్డుకోకపోవడం, ఓటర్ స్లిప్పులు అందించకపోవడం మరియు పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు లేకపోవడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని విమర్శించారు. ఎస్ఈసీ స్పష్టత లోపం వల్లే తిరుపతి (46.85%), విశాఖ (51.47%)లలో తక్కువ ఓటింగ్ నమోదైందని పేర్కొన్న ఈ సమావేశంలో నాయకులు బోర రమేష్, ప్రభాకరరావు, నాగేశ్వరావు, గోపి తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి ట్రయల్ రన్
విజయనగరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా, సిరిమానోత్సవం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన 'తెప్పోత్సవం' నిర్వహణకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమ్మవారి విగ్రహం లభ్యమైన చారిత్రాత్మక పెద్ద చెరువులో ఈ కన్నుల పండగ తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ పవిత్రమైన వేడుకకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ఈరోజు ఆలయ ఈవో శిరీష, ప్రధాన పూజారి వెంకటరావు మరియు ఇతర ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులందరూ ఈ కమనీయ దృశ్యాన్ని సురక్షితంగా, నేత్రపర్వంగా వీక్షించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక వసతులను అధికారులు పరిశీలించారు.
"తల్లడిల్లిన తల్లి గుండె..!"
విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలం దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ గ్రామంలో హృదయాలను కలచివేసే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తన 12 ఏళ్ల కుమార్తె సంపూర్ణను తల్లి జన్ని సుకరమ్మ భుజాలపైనే ఏడు కిలోమీటర్ల దూరం దబ్బగుంట కొండ దిగువకు మోసుకువెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్‌కోట ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన అనంతరం, మళ్లీ బిడ్డను భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. కూతురిపై ఆ తల్లి చూపిస్తున్న ప్రేమ అందరి చేత కంటతడి పెట్టిస్తుండగా, గిరిజన గ్రామానికి నేటికీ రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడం పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
రష్యా ఆర్మీలో విశాఖ యువకులు...
ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నంకు చెందిన ఐదుగురు యువకులు ఏజెంట్ల మోసానికి గురై రష్యన్ మిలటరీలో చిక్కుకున్నారంటూ సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపింది. రష్యా సైన్యంలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నేపాల్‌కు చెందిన ఒక ఏజెంట్ తమను మోసం చేశాడని, రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై సంతకాలు చేయించుకుని రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు యుద్ధంలోకి బలవంతంగా పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధభూమిలో ప్రాణభయంతో అల్లాడుతున్న తమను కాపాడి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ యువకులు కన్నీళ్లతో విజ్ఞప్తి చేశారు.

డేటా సెంటర్‌పై కాంగ్రెస్ న్యాయపోరాటం...
విశాఖపట్నంలో ప్రతిపాదించిన భారీ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు వల్ల పర్యావరణ వ్యవస్థ, భూగర్భ జలాలు మరియు స్థానిక ఉష్ణోగ్రతలపై పడే తీవ్ర ప్రతికూల ప్రభావాలను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఢిల్లీకి చేరుకున్నారు. APCC ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, విశాఖ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీహాసిని వర్మ, సీనియర్ న్యాయవాది కృష్ణ నేతృత్వంలోని బృందం డేటా సెంటర్ పర్యావరణ అనుమతులు, అధిక నీటి వినియోగం మరియు వేడి విడుదల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైంది. ప్రజా ఆరోగ్య పరిరక్షణ మరియు నగర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఈ చట్టపరమైన పోరాటాన్ని సాగిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

విటమిన్ డి లోపాన్ని గుర్తించండిలా
శరీర ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో అవసరం. దీని లోపం వల్ల అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు చేపలు, గుడ్లు, పాలు, చీజ్ వంటి పోషకాహారం తీసుకోవడంతో పాటు తగినంత సూర్యరశ్మి పొందాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి విటమిన్ డి పరీక్ష చేయించుకోవడం మంచిది.

భారత్‌తో వన్డే సిరీస్‌కు కివీస్‌కు భారీ షాక్
టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే భారత్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్ మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించింది. దీంతో జట్టులో టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్లకు చోటు కల్పించారు. నవంబర్ 4న ఆక్లాండ్ వేదికగా తొలి వన్డే జరగనుంది.

మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ మార్పు
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆయన తొలి సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ఈ చిత్రంలో శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధ మేకా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న 'మైత్రీ ఇన్ లవ్' సినిమాతో మేధ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. మరోవైపు మోక్షజ్ఞ తొలి సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

శరీరానికి నీటిని అందించడంలో సహాయపడుతుంది
తెలుగు వారి భోజనంలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి రుచికరమైన పచ్చళ్లలో దోసకాయ, వంకాయ, టమాటో కలిపి చేసే పచ్చడి ప్రత్యేకమైనది. ముందుగా నూనెలో వంకాయ ముక్కలు, టమాటోలు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర వేయించి చల్లార్చాలి. అనంతరం జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో కలిపి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు పెట్టాలి. దోసకాయ ముక్కలు కరకరలాడుతూ ఉండటంతో ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, దోసెతో ఎంతో రుచిగా ఉంటుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కూరగాయల్లోని విటమిన్లు, ఖనిజాలు కూడా పోషకాలను అందిస్తాయి.

‘కాయ్ రాజా కాయ్’: విజయనగరం మేయర్ పీఠంపై బెట్టింగ్‌ల పర్వం!
విజయనగరం మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుందని ఒక వీరాభిమాని ఏకంగా ₹30 లక్షల పందెం కాయగా, వివిధ ప్రాంతాల్లో ₹1 లక్ష నుంచి ₹5 లక్షల వరకు బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.2024 ఎన్నికల్లో పందాలు కాసి నష్టపోయిన అనుభవాలు ఉన్నా పందెం రాయుళ్ళు వెనక్కి తగ్గడం లేదు. కూటమిలోని సమన్వయ లోపం తమకు కలసివస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా, సొంత ఓటు బ్యాంకు, ప్రభుత్వ అభివృద్ధే గెలిపిస్తుందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ధీమాతో ఉంది. నిన్నటివరకు రేసులో వెనుకబడినట్లు కనిపించిన వైసీపీ కూడా ఇప్పుడు గట్టిగా పందాల్లోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.పట్టణంలోని మన్సబ్ వీధి,మొండి వీధి,గౌరి వీధి,చొక్కా వీధి,కోట మీద,ప్రకాశం మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పిన్నిశెట్టి నాగమణితో పాటు పట్టణ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.ప్రజల సమస్యల పరిష్కారం,ప్రాంత అభివృద్ధి కోసం వైసిపి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి అండగా నిలవాలని కోరారు.రానున్న రోజుల్లో గ్రామగ్రామాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పాఠశాలలో హెచ్ఎం అసభ్య ప్రవర్తన..?
విజయనగరం జిల్లా గరివిడి మండలం గదబవలస ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. హెచ్ఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు మండల విద్యాధికారి (M.E.O.) పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఫ్లైట్ టికెట్ల ధరల పెంపునకు చెక్: కొత్త రూల్స్ నోటిఫై చేసిన కేంద్రం
విమాన టికెట్ల ధరలు అసాధారణంగా పెరగకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 'భారతీయ వాయుయాన్ అధినియమ్-2026' నిబంధనలను తాజాగా నోటిఫై చేసింది. బ్రిటిష్ కాలం నాటి పాత ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో వచ్చే ఈ కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మారి ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డిమాండ్ సమయాల్లో ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వచ్చిన ఈ నిబంధనలు ఏవియేషన్ రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, టికెట్ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి.

వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు లభ్యం
ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వాట్సాప్ సేవలను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. పీఎఫ్ చందాదారులు తమ మొబైల్లో 8796441800 నంబరును సేవ్ చేసుకొని, 'హాయ్' అని మెసేజ్ పంపి పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను సులభంగా పొందవచ్చు. ఇకపై వాడకంలో లేని, రూ. 1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లోని నిధులను క్లెయిమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా సభ్యులతో ఈపీఎఫ్ఓ వద్ద రూ. 32 లక్షల కోట్ల నిధి ఉందని మంత్రి వెల్లడించారు.
రష్యా సైన్యంలో విశాఖ యువకులు.. కాపాడాలని వేడుకోలు!
ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖకు చెందిన ఐదుగురు యువకులు అక్కడి సైన్యంలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ముగ్గురిని రెండు నెలల క్రితమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రానికి పంపగా, నాటి నుంచి వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన ఇద్దరిని కూడా మరో రెండు రోజుల్లో యుద్ధ రంగానికి పంపే ప్రమాదం ఉందన్న సమాచారంతో, తమను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని సదరు యువకులు ఒక వీడియో ద్వారా ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విదేశాంగ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తమ పిల్లలను సురక్షితంగా మాతృభూమికి రప్పించాలని బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

విజయ"నగరం" ఎవరిదీ..?
విజయనగరంలో పోలింగ్ మందకొడిగా సాగి 62.93% గా నమోదైంది. 62 డివిజన్ల పరిధిలో కొన్ని డివిజన్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం సాగుతున్నప్పటికీ, అది కూటమికే సానుకూలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెజారిటీ స్వల్పంగా ఉన్నా విజయం కూటమి వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.