బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులు
విజయవాడలోని సిటీ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ (AR) గ్రౌండ్లో ఉంచిన విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేస్తూ వారిని ధైర్యపరిచారు.

నమ్మకమైన తాజా వార్తలు • vajione.com
















